దళితులు అంటరానివారు, బ్రాహ్మణులు పవిత్రులనే వ్యూహాన్ని అగ్రకులాలవారు అమలు చేస్తూ వెనుకబడిన కులాలవారిని అణచివేస్తున్నారు. ప్రజల మెదళ్లలో బ్రాహ్మణులు పవిత్రులనే ఆలోచనలు మరింత ఎక్కువ చేసేందుకు పుణ్యం పేరుతో ప్రజాప్రతినిధులు విచక్షణలేని పనులతో వివాదస్పదమవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, చినజీయర్ పాదాలపై పడి దీవెనలు తీసుకున్నారు. ఆయనకంటే రెండాకులు ఎక్కువే చదివారు జహీరాబాద్ ఎంపి బివి పాటిల్. నిజామాబాద్ జిల్లా కందకుర్తి పుష్కరఘాట్ లో పాటిల్ దంపతుల నెత్తిమీద కాళ్లు పెట్టి మరీ కేదారపీఠం, రంభపురి పీఠాధిపతులు ఆశీర్వదించారు. సమాజంలో దళితులకు అంత ప్రాధాన్యతలేదనే ఆధిపత్యకులాల ఆలోచనలకు బలం చేకూరేలా దళితుపై జరిగిన అమానుష ఘటనలకు సత్వర న్యాయం అందటం లేదు. ఇదే విషయాన్ని మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో మాదిగలపై కొనసాగుతున్న అణచివేతే రుజువు చేస్తుంది. బోయ, మాదిగ పేద కుటుంబాలే పాతపల్లి గ్రామంలో ఉన్నాయి. వీరితో పాటు పది రెడ్డి కుటుంబాలున్నాయి. రెడ్డి కుటుంబాలు వేరేగా నివసిస్తుంటే బోయలు బోయవాడలోనూ మాదిగలు ఊరికి వెలిగా మాదిగవాడలో నివసిస్తున్నారు. పాతపల్లి గ్రామంలో మాదిగ కులానికి ...
This is all about my Fashion...the term fashion describes my thoughts